రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నందుకు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా కడుపు మంట చల్లారిందో? అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండని.. అవ్వ, తాత, దివ్యాంగులను లైన్లో మళ్లీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి.. మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకుండా ఇళ్ల…