తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, మాస్ మహారాజ్ రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు…