మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలోని “భలే భలే బంజారా…” పాట సోమవారం సాయంత్రం విడుదలవుతోందని తెలిసిన దగ్గర నుంచీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే పాట కాకరేపుతోంది.”చీమలు దూరని చిట్టడివికి చిరునవ్వొచ్చింది… నిప్పు కాక రేగింది…” అంటూ పాట మొదలవుతుంది. పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ధరించడమే కాదు, డాన్సుల్లోనూ ఒకే స్టైల్ చూపించడం అభిమానులకు ఆనందం పంచే విషయం! “భలే…