ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో …