వరంగల్ నగరంలో అభివృద్ధి చేసిన ఉద్యానవనం భద్రకాళి ఫోర్‌షోర్ బండ్ అందాలు నగరవాసులనే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులను తన అందాలతో అదరహో అంటూ కట్టిపడేస్తుంది. వారాంతాలు, సెలవులు మరియు పండుగల సమయంలో, భద్రకాళి సరస్సు పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రక భద్రకాళి సరస్సు వద్ద అభివృద్ధి చేసిన థీమ్ పార్క్ అందాలను చూసి సందర్శకులు మంత్ర ముగ్ధులలవుతున్నారు. ఇక్కడ కొలువు దీరిన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన…