Viral Video: బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.