Bengaluru: బెంగళూర్‌లోని నమ్మ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ త్వరలో ప్రారంభంకాబోతోంది. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్), బొమ్మసంద్రను కలిపే ఈ మెట్రో లైన్ తుది భద్రతా తనిఖీలు చేస్తు్న్నారు. జూలై 22 నుండి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది.