యంగ్ లీడర్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానంలో ప్రయాణించారు. యుద్ధ విమానం నుంచి మంత్రి రామ్మోహన్ నాయుడు విజయ సంకేతం చూపిస్తూ గాల్లో దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ జేటీ-36 యశస్ యుద్ధ విమానంలో రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. పీఎం మోడీ పిలుపునిచ్చిన…