Mahindra BE 6: మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని గులాతి సమీపంలో మంటల్లో కాలిపోయింది. మహీంద్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు మంటల్లో చిక్కుకోవడం అందర్ని ఆశ్చర్యపరించింది. అసలు కారణాలు ఏంటనే దానిపై తాజాగా మహీంద్రా వివరాలు వెల్లడించింది. వాహనంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి గాయాలు కాలేదని కంపెనీ చెప్పింది.