Temba Bavuma: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆసీస్ జట్టుపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన తర్వాత, మ్యాచ్‌కి సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా సంచలన వ్యాఖ్య చేసారు. ఆట జరుగుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తూ స్లెడ్జింగ్ చేశారని పేర్కొన్నారు. ఆఖరి రోజు విజయం వైపుగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా జట్టును అసహజంగా ఆట తప్పించేందుకు, ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’…