ఇండియాలో చాలా మంది నటులు ‘ఇక చాలు’ అనేదాకా నటిస్తూనే ఉంటారు. వీలైతే ఎంత ఏజ్ బారైనా రొమాంటిక్ హీరో వేషాలే వేసేయాలని తాపత్రయపడతారు. కానీ, హాలీవుడ్ లో కొందరు టాప్ స్టార్స్ ప్రవర్తన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదాహరణకి… డేనియల్ క్రెయిగ్ ని తీసుకుంటే… ‘నో టైం టూ డై’ సినిమా తరువాత జేమ్స్ బాండ్ వేషం ధరించబోనని తేల్చేశాడు. ఆయన్ని దర్శకనిర్మాతలు ఎవ్వరూ పక్కకు తప్పుకోమని అడగలేదు. అయినా ‘సారీ ఐ కాంట్’ అనేశాడు!…