Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా జడలు విప్పింది. నలుగురైదుగురు కూటమి నేతలు ముఠాలుగా ఏర్పడి…. కొండల్ని పిండిచేసి మింగేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అండదండలతో అనుచరులు బరితెగించేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గంలో అక్రమాలకు తావులేదని బత్తుల చేస్తున్న హెచ్చరికలు ఉత్తుత్తి చప్పుళ్ళేనని, తెర వెనక వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవకుండా బలరామకృష్ణ స్టేట్‌మెంట్స్…