Bank Strike: వచ్చే నెలలో వివిధ బ్యాంకుల్లో సమ్మె జరగనున్నందున డిసెంబరులో బ్యాంకులు చాలా రోజులు మూసివేయబడవచ్చు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చింది.
ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు.…