Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో, ఆ దేశ రాజధాని ఢాకాలో దుండగులు బాంబు దాడి చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) బహిష్కృత నాయకుడు తారిఖ్ రెహమాన్ పర్యటనకు కొద్ది రోజుల ముందు, క్రిస్మస్ పండుగ ముందు రోజు ఢాకాలో తాజా హింస చెలరేగింది. బుధవారం సాయంత్రం రాజధానిలోని మొఘ్‌బజార్ కూడలి వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సందస్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన నాటు బాంబు పేలుడులో ఒకరు మరణించారు.