India-Bangladesh Border : భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌పై ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను ఢాకాకు పిలిపించడంతో ఈ వివాదం మరింత ముదురింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహ్మద్ జాషిమ్ ఉద్దీన్ సరిహద్దు ఫెన్సింగ్‌పై తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఐదు చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న…