Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.…