Amarnath Yatra2024 : దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో కట్టుదిట్టమైన భద్రతలో జరుగుతున్న వార్షిక తీర్థయాత్రలో రెండవ రోజు ఆదివారం 14,717 మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించుకున్నారు.
అమర్‌నాథ్ యాత్ర ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి దర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్‌లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారు. నువాన్-పహల్గామ్ రూట్లో 48 కిలోమీటర్లు, బల్తాల్ రూట్లో 14 కిలోమీటర్ల మార్గంలో భక్తులు వెళ్తున్నారు.