ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్‌తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు…