ఏపీలో ఇంకా ఎన్నికల మూడ్ రాకుండానే పొత్తుపొడుపులు ప్రారంభం అయ్యాయి. వైసీపీని ఓడించేందుకు ఇతర పార్టీలు కలిసి రావాలని ఈమధ్యే మాజీ సీఎం చంద్రబాబు వాకృచ్చారు. చంద్రబాబు కామెంట్లపై మండిపడ్డారు వైసీపీ నేతలు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సొంత పార్టీపై నమ్మకం లేదు. ప్రతీ ఎన్నికల సమయంలో అందుకే ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారన్నారు బాలినేని. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నప్పుడే సీఎం జగన్ ఎదుర్కొనలేక పోతున్నారని…