సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు హైదరాబాద్‌లోని హోటల్ నానీస్ బ్యాంక్వెట్ హాల్‌లో ఆదివారం (సెప్టెంబర్ 28) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి వచ్చిన ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకొని పోలీస్ ఫిర్యాదు నుండి తాత్కాలికంగా వెనక్కి తగ్గాలని సూచించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని గౌరవించారు. అయినప్పటికీ, తమ పోరాటం…