నందమూరి నటసింహం బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అది చిన్న గాయమేనని, కంగారు పడాల్సిందేమీ లేదని సమాచారం. షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీ బాలయ్య దానిని పెద్దగా పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టారు. అసలు ఆ గాయం ఏంటి ? షూటింగ్ ఎక్కడ జరిగింది ? అంటే… బాలయ్య ఓ టాక్ షోలో కన్పించబోతున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షోను నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్న…