23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది”…