విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన…