ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి…