పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,…
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…