వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచిన చరిత్ర దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు లేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఓ కారణం అయితే.. దురదృష్టం వెంటాడడం మరో కారణంగా ప్రొటీస్ ఇన్నాళ్లు టైటిల్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్ 2024లో ఫైనల్స్‌కు చేరినా.. భారత్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. మహిళల జట్టు కూడా తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా…