మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధం కాగా, ‘గుర్తుందా శీతాకాలం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ‘భోళా శంకర్’సెట్స్ పై ఉంది. అలానే ఈ అందాల చిన్నది హిందీలోనూ మూడు చిత్రాలలో నటిస్తోంది. ‘బోలే చుడియా’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలానే ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ సినిమా…