సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనతో ఓ తెలుగు దర్శకుడు ముందుకొచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రంతో టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి, భాషా సీక్వెల్ ప్లాన్ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా…