బుల్లితెరపై మురిపించి, వెండితెరపై వెలిగిపోయిన తారలు బాలీవుడ్ లో చాలామందే కనిపిస్తారు. వారిలో అందరికీ ముందుగా షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ తరం వారికి మాత్రం ఆయుష్మాన్ ఖురానా చప్పున మదిలో మెదలుతారు. బాలీవుడ్ లో నటునిగా ఈ యేడాదితో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయుష్మాన్. నటుడు, నిర్మాత జాన్ అబ్రహామ్ నిర్మించిన ‘విక్కీ డోనర్’తో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరిశారు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా 2012 ఏప్రిల్ 20న జనం ముందు…