ATM Theft: రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లి గణేష్ నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లోకి దుండగుడు చొరబడ్డారు. ఇనుప రాడుతో ఏటీఎం డోరు తెరిచే యత్నం.
దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. మొన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. అది మరచిపోకముందే ఏటీఎం లో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మ్రోగడం తో పరారయ్యారు దుండగులు.కాటేదాన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడ్డారు కొంతమంది దుండగులు. తమతో తెచ్చుకున్న రాడ్ తో ఏటీఎం డోర్ ధ్వంసం చేశారు దుండగులు. డోర్ తెరచుకోవడంతో వెంటనే అలారం మోగింది. దీంతో వెంటనే అలర్ట్…