దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ అక్షర్ ఆడని విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అక్షర్ లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో రాణించడంతో…