ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు బహుమతి ప్రకటిస్తున్నాయ్. పంజాబ్ సర్కార్ కోటి రూపాయలు ప్రకటిస్తే…హర్యానా రెండున్నర కోట్లు ఇస్తామని వెల్లడించింది. తామేమీ తక్కువ కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం…ఒక్కో ప్లేయర్ కోటి ఇస్తామన్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ క్రీడాకారులకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు నజారానాలు ప్రకటిస్తున్నారు. ఒక ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తామంటే…మరో ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. జట్టు సభ్యులందరికి కాదు…కేవలం ఆయా రాష్ట్ర క్రీడాకారులకు మాత్రమేనని చెబుతున్నాయ్.…