బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు. కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి. తరచుగా ప్రజలు పగటిపూట కొద్దిగా భోజనం చేసి.. రాత్రి ఎక్కువగా తింటారు. రోజు ఇలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి. 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి.