AV Infra Fraud Case: రియల్ ఎస్టేట్ రంగంలో ఏవీ ఇన్‌ఫ్రా కంపెనీకి సంబంధించిన భారీ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మాదాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏవీ ఇన్‌ఫ్రా (AV Infra) కంపెనీ పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను మోసగించిన ఘటన తాజాగా బయటపడింది. ఈ మోసానికి సంబంధించి కంపెనీ సీఎండీ విజయ్ గోగులను సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. Read Also:Jagtial: 800 క్వింటాళ్ల అక్రమ PDS రైస్.. దాడులు చేసి…
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు.