వారం రోజుల క్రితమే పెళ్ళయింది. పెళ్ళి కూతురు కాళ్ళ పారాణి కూడా ఆరలేదు. కానీ విధి రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్ కొత్త పెళ్ళికొడుకు ప్రాణాలను బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా…