Today (01-02-23) Business Headlines: ఇండియాలో యాపిల్ విస్తరణ: యాపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్స్ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్.. భారత్‌దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్ ఎన్‌క్లోజర్లను లేదా ప్లాస్టిక్ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.