Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్‌డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన…