Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.