Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్‌లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.