Dog attacks: తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య వీధి కుక్కలు తెగ రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని అత్యంత కిరాతకంగా వీధి కుక్కలు దాడి చేయగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.