బాన్సువాడ బీజేపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటిపై బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. రాత్రి నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో పాటు, డ్రైవర్‌పై దాడి చేసి భయాందోళన సృష్టించి ఎన్నికలలో గెలవాలని చూడడం పిరికిపందల చర్య అన్నారు. ఓటమి భరించలేక దాడులకు తెగబడుతున్న బీఆర్ఎస్ గుండాల్లారా మీ ఆటలు ఇక సాగవు…
బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న యెండల లక్ష్మి నారాయణతో పాటు కార్యకర్తలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది బీఆర్ఎస్ గుండాలపనే అని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఆయనపై జరిగిన దాడిపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతో పాటుగా లక్ష్మీనారాయణ గారి డ్రైవర్‌పై భౌతికదాడులకు…