బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత…