ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను వైజాగ్ అవంతి కాలేజీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన…