ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. Read Also: వివాదంలో విరాట్…