Adina mosque: మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ‘‘ఆదినా మసీదు’’ను సందర్శించారు. సందర్శించిన సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. తన పోస్టులో ‘‘ ఆదినా మసీదు ఒక అద్భుతమని ’’ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా యూసఫ్ పఠాన్‌పై బీజేపీ, సోషల్ మీడియా నెటిజన్ల నుంచి విమర్శలు ప్రారంభయ్యాయి.