టీమిండియా మాజీ లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్.. మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా.. ఆయన స్థానంలో మిగతా టెస్టు మ్యాచ్‌ల కోసం యువ క్రికెటర్‌ను ఎంపిక చేశారు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు బౌలింగ్ ఆల్ రౌండర్ తనుష్ కోటియన్ జట్టులో చేరనున్నాడు.