Ashada bonalu: హైదరాబాద్ లో ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. వచ్చే నెల 22న హైదరాబాద్‌లో ఆషాడ బోనాల జాతర ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఈ నెలరోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.