Good News for ASHA Workers: ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ప్రకటించింది.