తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిషేధిత ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అరుణాచలం ను ముందుగా కస్టడీకి తీసుకోనున్నారు బెజవాడ పోలీసులు. డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులతో సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అరుణాచలం ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది.…