ఈ ఏడాది ‘ఆర్టికల్ 370’ లాంటి శక్తివంతమైన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకుంటోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల కన్నా, కంటెంట్ ప్రధానమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఇక ప్రస్తుతం ‘దురందర్’ అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న యామీ, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎంపిక చేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.…